News May 6, 2024
పవన్ నా కుటుంబాన్ని రోడ్డుకు లాగాడు: ముద్రగడ
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ‘నేను చిరంజీవి, పవన్ గురించి ఏరోజూ మాట్లాడలేదు. నా కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టాడు. నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీ కుటుంబంలో డ్రగ్స్‌తో పట్టుబడిన అమ్మాయిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, మీరు వదిలేసిన ఇద్దరు భార్యల్ని ఎందుకు పరిచయం చేయట్లేదు? నాపై ప్రేమ నటించొద్దు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 29, 2024
WTC ఫైనల్‌కు సౌతాఫ్రికా
సౌతాఫ్రికా తొలిసారిగా WTC ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌కు వెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి వరకూ అద్భుతంగా పోరాడింది. 56కే 4 వికెట్లు కోల్పోయినా చివర్లో రబాడ (31*), జాన్సెన్ (16*) రాణించడంతో విజయం సాధించింది. రెండో స్థానం కోసం భారత్ (55.89), ఆస్ట్రేలియా (58.89) పోటీ పడుతున్నాయి.
News December 29, 2024
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ సమాధానమిదే
TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటపై పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ స్పందించింది. ‘‘పుష్ప 2’ కోసం 4, 5 తేదీల్లో మైత్రీ మూవీస్ బుక్ చేసుకుంది. మా థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. చాలామంది హీరోలు ఇక్కడికి వచ్చినా ఇలాంటివి జరగలేదు. ఫ్యాన్స్ చొచ్చుకురావడంతోనే తొక్కిసలాట జరిగింది. 45 ఏళ్లుగా మేం థియేటర్‌ను నడిపిస్తున్నాం’ అని నోటీసుల్లో పేర్కొంది.
News December 29, 2024
ఆ రైలు వేగం గంటకు 450 కి.మీ
గంటకు గరిష్ఠంగా 450 KM వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది. CR450 రైలుకు Sun ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇంజిన్ పరీక్షల్లో 400 KM అందుకుంది. గతంలో ప్రవేశపెట్టిన CR400 కంటే 20% ఇంధనాన్ని తక్కువ వినియోగిస్తూ, 12% బరువు తక్కువ ఉండే CR450 బీజింగ్ నుంచి షాంఘైకి (1,214 KM) రెండున్నర గంటల్లో చేరుకోగలదు. ఇది ప్రపంచంలోనే వేగంగా నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుకెక్కనుంది.