News May 6, 2024
మరికొద్ది రోజుల్లో కొడుకు పుట్టినరోజు.. ఇంతలోనే..
జమ్మూకశ్మీర్ పూంఛ్‌లో IAF వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో కార్పొరల్ విక్కీ పహాడే (33) మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ‘జూన్ 7న తన ఐదేళ్ల కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు విక్కీ ప్లాన్ చేస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది’ అని కుటుంబసభ్యులు వాపోయారు. కాగా చివరగా రెండు వారాల క్రితం విక్కీ తన సోదరి పెళ్లికి హాజరయ్యారు.
Similar News
News December 29, 2024
సీఎం యోగి నివాసం కింద శివలింగం: అఖిలేశ్
UP CM యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ వద్ద సమాచారం ఉందని, లింగాన్ని వెలికితీసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంభల్‌లో మెట్ల బావి బయటపడిన అనంతరం ASI తవ్వకాలు చేపట్టడంపై BJPని అఖిలేశ్ తప్పుబట్టారు. ‘వాళ్లు ఇలాగే తవ్వుకుంటూ పోతారు. ఏదో ఒకరోజు సొంత ప్రభుత్వానికే గోతులు తవ్వుకుంటారు’ అని విమర్శించారు.
News December 29, 2024
విషాదం.. సుమిత్ కన్నుమూత
మధ్యప్రదేశ్ గుణ(D) పిప్లియా గ్రామంలో బోరుబావిలో నిన్న పడిన పదేళ్ల బాలుడు సుమిత్(10) కథ విషాదాంతమైంది. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు బావికి సమీపంలో గొయ్యి తీసి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా చల్లని వాతావరణంలో ఉండటంతో శరీర భాగాలు స్తంభించి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
News December 29, 2024
నుమాయిష్ ప్రారంభం వాయిదా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.