News May 6, 2024
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోంది ‘కుబేర’. ప్రస్తుతం ముంబైలోని అతి పెద్ద డంపింగ్ యార్డ్‌లో షూట్ చేస్తున్నారు. సన్నివేశాలు సహజంగా వచ్చేందుకు గాను హీరో ధనుష్ మాస్క్ ధరించకుండా ఏకధాటిగా 10 గంటల పాటు దుర్గంధాన్ని భరిస్తూ షూట్‌లో పాల్గొన్నారట. దీంతో ధనుష్ నిబద్ధత పట్ల ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కుబేర’లో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 29, 2024
రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
AP: నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం, డీజేలు, బైక్, కార్ రేసులు నిర్వహించకూడదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
News December 29, 2024
నేను జనసేనలో చేరడం లేదు: తమ్మినేని సీతారాం
AP: తనకు జనసేనలో చేరాల్సిన అవసరం లేదని YCP నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్‌ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
News December 29, 2024
కాంగ్రెస్‌వి చీప్ పాలిటిక్స్: బీజేపీ
మన్మోహన్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించకుండా ఆయన్ను అవమానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్యక్రియల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశారనేది అవాస్తవమని, భద్రతా సంస్థలు కవరేజీపై ఆంక్షలు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.