News May 6, 2024
రేపు ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల
AP EAPCET హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఈనెల 16, 17 తేదీల్లో జరగనుండగా, ఇంజినీరింగ్ పరీక్షలు ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/
Similar News
News December 29, 2024
కాంగ్రెస్‌వి చీప్ పాలిటిక్స్: బీజేపీ
మన్మోహన్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించకుండా ఆయన్ను అవమానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్యక్రియల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశారనేది అవాస్తవమని, భద్రతా సంస్థలు కవరేజీపై ఆంక్షలు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.
News December 29, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్
TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
News December 29, 2024
సీఎం యోగి నివాసం కింద శివలింగం: అఖిలేశ్
UP CM యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ వద్ద సమాచారం ఉందని, లింగాన్ని వెలికితీసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంభల్‌లో మెట్ల బావి బయటపడిన అనంతరం ASI తవ్వకాలు చేపట్టడంపై BJPని అఖిలేశ్ తప్పుబట్టారు. ‘వాళ్లు ఇలాగే తవ్వుకుంటూ పోతారు. ఏదో ఒకరోజు సొంత ప్రభుత్వానికే గోతులు తవ్వుకుంటారు’ అని విమర్శించారు.