News May 6, 2024
నాగర్ కర్నూల్లో ఎవరి ధీమా వారిదే.!!
NGKL ఎంపీ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJPల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుందని, పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామని INC అభ్యర్థి మల్లు రవి ప్రచారం చేస్తున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ రావాలని BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.
Similar News
News January 17, 2025
బిజినేపల్లి: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: భాస్కర్
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్, పరిశీలకులకు బిజినేపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 సీట్లకుగాను ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 6,602 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈనెల18న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.
News January 16, 2025
నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News January 16, 2025
శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు
శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.