News March 19, 2026
పోలీసులు.. పొలిటికల్ కనుసన్నల్లోనే(3/3)

పసిపిల్లల విక్రయాలు స్థానిక పోలీసులకు తెలిసే జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. అదేవిధంగా విక్రయాలు చేసే గ్యాంగ్ ప్రధాన సూత్రధారి నియోజకవర్గ నేత పక్కనే ఉంటూ ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. పోలీసులు నిందితులను గుర్తించినా విడిచిపెడుతున్నారనే వాదన బలంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయిలో ఈ గ్యాంగ్ అరాచకాలపై దృష్టి సారించకుంటే ఈ గ్యాంగ్ అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదు.
Similar News
News April 17, 2026
గద్వాల: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించి, అదనపు సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు.
News April 17, 2026
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..
News April 17, 2026
‘టాక్సిక్’ స్టోరీ లైన్ చెప్పిన యశ్

ఇండిపెండెన్స్ సమయంలో గోవాలో జరిగే తండ్రీ కొడుకుల రివేంజ్ డ్రామాగా ‘టాక్సిక్’ తెరకెక్కిందని హీరో యశ్ వెల్లడించారు. లాస్ వేగాస్(US)లో జరిగిన CinemaCon వేడుకల్లో 9 నిమిషాల మూవీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కొన్నేళ్లపాటు గోవాలో కొనసాగిన పోర్చుగీస్ పాలనలో పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.


