News March 19, 2026
FLASH: త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్!

ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లింపులు చేసి, కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.
Similar News
News April 12, 2026
IPL: ఢిల్లీ చెత్త రికార్డు

CSKతో మ్యాచ్‌లో <<19628621>>ఓడిన<<>> ఢిల్లీ క్యాపిటల్స్ IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక సార్లు(31) ఆలౌట్ అయిన జట్టుగా తన స్థానాన్ని మరింతగా ‘మెరుగు’పరుచుకుంది. ఈ లిస్టులో PBKS(27), RCB(26) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఢిల్లీతో ఆడిన 9 మ్యాచుల్లో 8 సార్లు CSK గెలిచింది. ఇదే స్టేడియంలో వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నైని విజయం వరించింది.
News April 12, 2026
NTR ‘డ్రాగన్’లో విలన్‌గా బాలీవుడ్ హీరో?

NTR, నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. విలన్‌గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలుత మలయాళ నటుడు టొవినో థామస్‌ను తీసుకోవాలని భావించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తాను <<19526769>>నటించడం లేదని<<>> టొవినో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో షాహిద్‌ను తీసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 12, 2026
ఇరాన్‌పై పోరాటం కొనసాగిస్తాం: నెతన్యాహు

ఇరాన్ టెర్రర్ పాలన, దాని మిత్రపక్షాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టంచేశారు. తమ సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల ఉనికిని సహించబోమని హెచ్చరించారు. శత్రు భూభాగంలో సెక్యూరిటీ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కుర్దిష్ పౌరులపై సామూహిక హత్యాకాండకు ఆయనే బాధ్యుడని ఆరోపించారు.


