News March 19, 2026
ప్రయాణికులకు అలర్ట్.. ఆలస్యంగా విశాఖ-రాజమండ్రి మెము రైలు

విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పు చోటుచేసుకుంది. లింక్ రేక్ ఆలస్యం కారణంగా గురువారం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం-రాజమండ్రి మెము (రైలు నం.67286) రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ అయ్యిందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.
Similar News
News April 16, 2026
సీఎం పర్యటన వేళ పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

సీఎం చంద్రబాబు రేపు మంగళగిరి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని సీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గురువారం కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఎస్పీ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక వద్ద ప్రొటోకాల్ అమలు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా పరమైన అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
News April 16, 2026
మే 9న కొవ్వూరులో జాతీయ లోక్ అదాలత్

రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు మే 9న కొవ్వూరు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 9వ జిల్లా జడ్జి ఎం.అనురాధ తెలిపారు. ఈ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. భార్యాభర్తల తగాదాలు, గృహహింస కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 16, 2026
తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ


