News March 19, 2026

MLAగా నారా రోహిత్ పోటీ..?

image

చంద్రగిరి(M) నారావారిపల్లెలో హీరో రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇది వరకు చంద్రగిరి MLAగా గెలిచారు. ఇప్పుడు అక్కడ పులివర్తి నాని సిట్టింగ్ MLAగా ఉన్నారు. ఒకవేళ రోహిత్ ఎన్నికల్లో పోటీచేస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తారా లేక మరోదైనా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.

Similar News

News March 26, 2026

NLG: డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాల్లో మార్పులు

image

రాబోయే డీలిమిటేషన్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుందని విశ్లేషకుల అంచనా. జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ప్రస్తుతం రిజర్వ్‌డ్ స్థానాలుగా ఉన్న దేవరకొండ, నకిరేకల్, తుంగతుర్తి సరిహద్దుల్లో మార్పులు తప్పవని భావిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరిగితే, ప్రతి జిల్లాకు అదనంగా మరో SC లేదా ST స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

News March 26, 2026

ఫుట్‌బాల్ టీంకు ఏడుగురు జిల్లా పోలీసుల ప్రాతినిధ్యం

image

తెలంగాణలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్-2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్.ఇమామ్ ఖాసిం (ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్.సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి.రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్.శివ సుబ్రమణ్యం (డి.ఎ.ఆర్) ఉన్నారు.

News March 26, 2026

WGL: విలీన గ్రామాలకు బడ్జెట్లో 1/3 శాతం నిధులు

image

GWMC విలీన గ్రామాల అభివృద్ధికి బడ్జెట్లో 1/3% నిధులు రూ.25.48 కోట్లు కేటాయించారు. రోడ్లకు రూ.12.43 కోట్లు, డ్రైనేజీలకు రూ.9.75 కోట్లు, తాగునీటికి రూ.1.50 కోట్లు, మౌలికానికి రూ.1.75 కోట్లు, కనీస అవసరాలకు రూ.2.70 కోట్లు, స్మశాన వాటికలకు రూ.20 లక్షలు, పార్కులు రూ.15 లక్షలు, మరుగుదొడ్లు రూ.20 లక్షలు, మార్కెట్లకు రూ.10 లక్షలు, జంతు వధశాలకు రూ.40 లక్షలు, శానిటేషన్ రూ.75 లక్షలు తదితరాలకు కేటాయించారు.