News March 19, 2026
భద్రాద్రి రామయ్య పెళ్లికి వేళాయె..!

భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27న మిథిలా స్టేడియం వేదికగా జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, మహా పట్టాభిషేకం, రథోత్సవం, తెప్పోత్సవాలు, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News April 9, 2026
తెలంగాణ వర్సిటీ M.Ed పరీక్షా ఫీజు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.Ed మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 15 వరకు రూ.100 ఆలస్య రుసుంతో ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News April 9, 2026
చండ్ర రాజేశ్వరరావు మహానేత: సీపీఐ నేత రామకృష్ణ

చండ్ర రాజేశ్వరరావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన మహానేత అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. పత్తికొండ సీపీఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి, పేదలకు భూములు పంచిన త్యాగశీలి అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 9, 2026
TU: విద్యను సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి: రిజిస్ట్రార్

తెలంగాణ విశ్వవిద్యాలయంలో SC, ST సెల్, BC సెల్, ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలను రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ప్రారంభించారు. మహనీయులు చూపిన ఆశయాలను ఆచరించిన నాడే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విద్యార్థులు నేర్చుకున్న విద్యను సమాజ అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


