News March 20, 2026
TODAY HEADLINES

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Similar News
News April 1, 2026
IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.
News April 1, 2026
అమరావతి బిల్లుపై చర్చకు YCP

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.
News April 1, 2026
రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.


