News May 6, 2024
REWIND: నరసాపురం నుంచి KA పాల్ పోటీ.. ఓట్లు ఎన్నో తెలుసా..?

2019 ఎన్నికల్లో ప.గో. జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి అధ్యక్షుడు K.A పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలో ఆయనకు 281 ఓట్లు వచ్చాయి. అందులో 278 ఈవీఎం, 3 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఇదే నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు 1143. ఆ తర్వాత నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బరిలో నిలవగా 3037 ఓట్లు వచ్చాయి. నోటాకు 12,066 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News September 12, 2025
ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలి: జేసీ

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభం కావున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
News September 11, 2025
మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News September 11, 2025
‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.