News March 20, 2026
పలమనేరు మాజీ MLA మృతి

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (108) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పింఛన్‌తోనే జీవనం సాగించారు.
Similar News
News April 1, 2026
వరంగల్ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. ఈ నెల 3న శుక్రవారం గుడ్ ప్రైడే, శనివారం, ఆదివారం వారాంతరపు సెలవుల కారణంగా మార్కెట్ యార్డ్‌లో క్రయ, విక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. తిరిగి ఈ నెల 6న మార్కెట్ యార్డ్ పునః ప్రారంభం అవుతుందన్నారు. రైతులు సహకరించాలని కోరారు.
News April 1, 2026
నెల్లూరు జిల్లా అధికారులకు CM వార్నింగ్

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు 67.37% మంది సంతృప్తిగా ఉంటే నెల్లూరు జిల్లాలో 69.33%మంది ఉన్నారని CM చంద్రబాబు చెప్పారు. ‘కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరు బాగుంది. ఇంకా బాగా పనిచేసి ప్రజల ఓట్లు మాకు వచ్చేలా చూడండి. ఉదయగిరిలో R&B, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ప్రజల సంతృప్తి మైనస్‌లో ఉంది. బీ కేర్‌ఫుల్. నేను ఆకస్మిక తనిఖీలకు వస్తా. దొరికితే చర్యలు తప్పవు’ అని సీఎం హెచ్చరించారు.
News April 1, 2026
కళ్లు అదురుతున్నాయా? 7 కారణాలివే

కళ్లు అదరడం అనారోగ్య సమస్యకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి/ఆందోళన, అలసట, కెఫిన్/ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల వచ్చే ఐ అలెర్జీ, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వంటి 7 అంశాలు దీనికి కారణాలు కావచ్చని పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారానికి మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


