News March 20, 2026

పలమనేరు మాజీ MLA మృతి

image

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (106) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు‌. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పెన్షన్‌తో జీవనం సాగించారు.

Similar News

News April 2, 2026

రూపీ సూపర్ రికవరీ

image

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.

News April 2, 2026

HYD: టౌన్ ప్లానింగ్, రెవెన్యూలో అక్రమాల గుట్టురట్టు

image

LBనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో మ్యుటేషన్లు, ప్లాన్ అప్రూవల్స్‌పై విజిలెన్స్ పంజా విసిరింది. ఫైల్ నం. LBN/TP/2025/1104 సహా 14 కీలక ఫైళ్లను సీజ్ చేసింది. పాత తేదీలతో అనుమతులిచ్చినట్లు నిర్ధారణైంది. నిందితులు సెక్షన్ ఆఫీసర్ కే.సత్యనారాయణ(టౌన్ ప్లానింగ్), ఆర్ఐ బీ.రాంరెడ్డి(రెవెన్యూ), ముగ్గురు ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి ఫోన్లలో అధికారులతో జరిపిన నగదు లావాదేవీల చాటింగ్‌లు బయటపడ్డాయి.