News May 6, 2024
ఒక్క మామిడి చెట్టు 5 ఏసీలకు సమానం!

ఐదు ఏసీలు వెయ్యి గంటల పాటు పని చేస్తే వచ్చే చల్లదనాన్ని ఒక మామిడి చెట్టు ఇస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 50ఏళ్ల మామిడి చెట్టు తన జీవిత కాలంలో 81 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని.. 271 టన్నుల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందుకే వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే ఏసీలు, వాహనాల వాడకాన్ని తగ్గించి.. భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 21, 2025
దోబూచులాడుతున్న బంగారం ధరలు!

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,250లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60 పెరగడంతో రూ.88,100లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది.
News February 21, 2025
CONFIRM: గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్

తన బయోపిక్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తారని మాజీ క్రికెటర్ గంగూలీ వెల్లడించారు. అయితే డేట్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి ఏడాది టైమ్ పడుతుందని చెప్పారు. గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.
News February 21, 2025
పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో CM పూజలు

TG: వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు ఆలయాన్ని సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.