News March 20, 2026

గోవాలో IEMDST-2026 సదస్సు

image

గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Goa) ఆధ్వర్యంలో జూన్ 8, 9 తేదీల్లో “IEMDST-2026” అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు NIT వరంగల్ ఫిజిక్స్ విభాగంతో కలిసి నిర్వహిస్తున్నారు. సస్టైనబుల్ టెక్నాలజీలకు సంబంధించిన మెటీరియల్స్, డివైసెస్‌పై పరిశోధనలు ప్రదర్శించే వేదికగా ఇది నిలుస్తుంది. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు.

Similar News

News March 23, 2026

CGD నెట్వర్క్‌తో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

image

AP: LPG కొరత నేపథ్యంలో ఇళ్లకు, వ్యాపారాలకు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) పంపిణీకి GOVT చర్యలు చేపట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు GO జారీచేసింది. PNG సరఫరాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు విధివిధానాలను నిర్దేశించింది. పైప్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అనుమతులు వంటివి వేగంగా పూర్తయ్యేలా గడువు విధించింది. ఇందుకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది.

News March 23, 2026

భద్రాచల రాముడి వివాదం.. విచారణ రేపటికి వాయిదా

image

భద్రాచల రాముడి వివాదంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. భద్రాచల సీతారాముల గోత్ర, ప్రవర్తపై వివాదం నడుస్తోంది. ఓ వర్గం దశరథ రాముడని, మరో వర్గం రామనారాయణుడని వాదిస్తున్నారు. 2012 వరకు శ్రీరాముడిని దశరథ పుత్రుడిగా వశిష్ఠ గోత్రోద్భవడిగా, సీతమ్మ వారిని గౌతమస గోత్రంగా పూజించేవారని, తర్వాత మార్చారని అంటున్నారు. వాస్తవాలు తేల్చేందుకు కోర్టు ఐదుగురితో కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

News March 23, 2026

సంగారెడ్డి: పదవ తరగతిలో 99.84% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 24,598కి 24,559 విద్యార్థులు పరీక్ష రాశారు. 99.84% హాజరు నమోదైనట్లు డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డిలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు జిన్నారం, దౌల్తాబాద్, హత్నూర, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి రామచంద్రపురం, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది 40 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.