News May 6, 2024
పంజాబ్ ఓటములపై ప్రీతి జింటా అసంతృప్తి
ఈ IPLలో PBKS ఆటపై అభిప్రాయం చెప్పాలన్న నెటిజన్ ప్రశ్నకు జట్టు కో ఓనర్ ప్రీతిజింటా Xలో స్పందించారు. ‘మాకు సంతోషంగా లేదు. చివరి బంతి వరకు వచ్చి 4 మ్యాచ్‌లలో ఓడిపోయాం. గాయం కారణంగా కెప్టెన్ ధవన్ ఆడట్లేదు. కొన్ని మ్యాచ్‌లను అద్భుతంగా ఆడాం. కొన్నింటిలో మా మార్క్‌ను చేరుకోలేకపోయాం. హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లలోనూ గెలిస్తే ముందుకెళ్లగలం. మాకు సపోర్టుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2025
రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి BIG UPDATE
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 2వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఆట మొదలైంది అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫొటోను పంచుకుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.
News January 1, 2025
ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే
IND, AUS మధ్య ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) ఈనెల 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచుకు స్టేడియం మొత్తం పింక్ కలర్‌లో దర్శనమివ్వనుంది. AUS ప్లేయర్లు సైతం పింక్ క్యాప్స్ ధరిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా 2009 నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో మెక్‌గ్రాత్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ రోగుల కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు.
News January 1, 2025
తగ్గిన సిలిండర్ ధర
కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.