News March 20, 2026
ANU: రిజల్ట్స్ వచ్చాయి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మ్. డీ మొదటి ఏడాది, బి.ఫార్మసీ 1-6 సెమిస్టర్ల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. (సెప్టెంబర్/అక్టోబర్ 2025) రీ-వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను పరిశీలించుకోవాలన్నారు. మార్కుల్లో మార్పులు ఉంటే తదుపరి అకాడమిక్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 4, 2026
IPL చూసేవారికి JIO షాక్

మెగా టోర్నీ వేళ రిలయన్స్ జియో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 30 రోజులకు తగ్గించింది. అయితే ఇందులో వచ్చే 15GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యథావిధిగా అందిస్తుంది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది భారంగా మారింది.
News April 4, 2026
జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా: పి.అవని

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రస్తుతం 98 శాతం యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ఎం.అవని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. ఈ నెల 6వ (సోమవారానికి) రాష్ట్రమంతా 100 శాతం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లా ప్రజలు, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
News April 4, 2026
ములుగు: సూర్యుడి చుట్టూ వలయం.. ఆసక్తిగా తిలకించిన జనం

ములుగు ప్రాంతంలో ఆకాశంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సూర్యుడి చుట్టూ మబ్బులతో కూడిన వలయం ఏర్పడింది. సాధారణంగా సూర్యుడు, చంద్రుని చుట్టూ ఏర్పడే వలయాలను ‘వరదగూడు’అని పిలుస్తారు. వీటి వ్యాసార్థం బట్టి అతి వృష్టి, అనా వృష్టిని అంచనా వేస్తారు. కానీ, ఈరోజు కనిపించిన దృశ్యంలో సూర్యుడికి దూరంగా, ఇంద్రధనుస్సును పోలిన రంగుల్లో వలయం ఉండటంతో సర్వత్రా ఆశ్చర్యపోయారు.


