News March 20, 2026

రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

image

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.

Similar News

News April 11, 2026

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <>రెండో షార్ట్ లిస్ట్<<>> విడుదలైంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1060, TGలో 608 ఖాళీలున్నాయి. తాజా లిస్టులో AP నుంచి 555 మంది, TG నుంచి 214 మంది ఎంపికయ్యారు. వీరంతా APR 27వ తేదీ లోగా డివిజనల్ ఆఫీసులో ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేపట్టిన విషయం తెలిసిందే.

News April 11, 2026

మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

image

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>

News April 11, 2026

సంక్రాంతికి బాలయ్య-విజయ్ కనకమేడల సినిమా?

image

‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీయే సంక్రాంతి బరిలో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్లాన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.