News May 6, 2024

అనకాపల్లి సభలో సీఎం రమేశ్ ఏమన్నారంటే!

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో జరిగిన సభలో సీఎం రమేశ్ కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది చంద్రబాబు కాదా అని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు. బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు.

Similar News

News October 22, 2025

విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

image

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.

News October 22, 2025

గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.

News October 22, 2025

విశాఖలో రూ.7,62,892 విలువ గల బాణసంచా సీజ్

image

విశాఖలో దీపావళి వేడుకల్లో 3 సంవత్సరాల కంటే చాలా తక్కవ వాయుకాలుష్యం నమోదు అయ్యింది. సీపీ ఆదేశాలతో పోలీసులు దాడులు జరిపి 39 కేసులు నమోదు చేసి, రూ.7,62,892 విలువ గల నకిలీ మందుగుండు సామగ్రి, లైసెన్స్ లేని బాణసంచా సామగ్రి సీజ్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి తర్వాత, 3 మూడు సంవత్సరాల కంటే తక్కువగా నగరంలో వాయుకాలుష్యం నమోదు అయిందని విశాఖ పోలీసులు బుధవారం తెలిపారు.