News March 21, 2026

అనకాపల్లి: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో 4గురు కేంద్ర మంత్రులు

image

నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో నలుగురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,పి. చంద్రశేఖర్ పాల్గొనున్నారు. వీరితో పాటు స్టీల్ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ హాజరవుతారు.

Similar News

News April 8, 2026

సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలిసారి డిజిటల్ హాల్‌టికెట్ల అమలు

image

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యార్థుల కోసం క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత డిజిటల్ హాల్‌టికెట్లను రూపొందించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎస్‌ఏ-2 పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హాల్‌టికెట్లను స్కాన్ చేయగానే విద్యార్థి పూర్తి వివరాలు ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే విధంగా ఉపాధ్యాయ బృందం సాంకేతికతను సమర్థంగా వినియోగించింది.

News April 8, 2026

మెదక్: మోటార్ వేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి

image

విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జగ్గంపేట సుధాకర్ (29) బుధవారం ఉదయం ఇంటి నల్లా నీటి కోసం మోటార్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య కల్పన, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

News April 8, 2026

WGL: రోగులకు ప్రిస్కిప్షన్ ఇవ్వడం లేదంటూ లేఖ

image

రోగులకు ఏ మాత్ర, ఏ సమయంలో వేసుకోవాలో తెలిసేలా ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చే మాదిరిగా ప్రిస్కిప్షన్ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి MGMలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో లేఖ వేశారు. MGMలో సదుపాయాలపై ఫిర్యాదుల పెట్టెను WGL కలెక్టర్ సత్యశారద ఏర్పాటు చేశారు. ఈ పెట్టెను తనిఖీలను వచ్చిన రోజు తీయడంతో లేఖ వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. వెంటనే కలెక్టర్.. రోగులకు ఏ మాత్ర ఎప్పుడు వేసుకోవాలో తెలిసేలా ఇవ్వాలని ఆదేశించారు.