News March 21, 2026

తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

Similar News

News April 5, 2026

భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మడ అడవులు ఉన్న దర్భరేవు, బియ్యపుతిప్ప, వేములదీవి ప్రాంతాల్లో కొత్త ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.