News March 21, 2026
పల్నాడు జిల్లాలో వర్షం

పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మెరుపులు, ఈదురు గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు కొనసాగించాలన్నారు. పెదకూరపాడు, రొంపిచర్ల, అమరావతి మండలాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది..?
Similar News
News April 6, 2026
బాపట్ల ఆర్ట్స్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం

బాపట్ల ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 6, 2026
₹6.5 లక్షల కోట్లకు బంగారం దిగుమతులు

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలోకి బంగారం దిగుమతులు 28.73% పెరిగాయి. వీటి విలువ సుమారు ₹6.5 లక్షల కోట్లుగా నమోదైంది. పసిడి ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 దాటిపోయింది. స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40% బంగారం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల ప్రభావంతో దేశ వాణిజ్య లోటు కూడా పెరిగి ₹29.20 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
News April 6, 2026
బాసర: కృష్ణ శిలలతో ‘సరస్వతీ’ గర్భాలయం

చదువుల తల్లి కొలువుదీరిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రం కొత్త శోభను సంతరించుకోనుంది. ఆలయ సుందరీకరణ, పున:నిర్మాణం కోసం ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు ముహూర్తం ఖరారైంది. రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు సీఎం సోమవారం భూమిపూజ చేయనున్నారు. యాదాద్రి తరహాలోనే కృష్ణ శిలలతో గర్భగుడిని అద్భుతంగా నిర్మించనున్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా సర్కారు మ్యాప్‌ను సిద్ధం చేసింది.


