News March 22, 2026
భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.
Similar News
News April 11, 2026
ఫోన్ పోయిందా? ‘సంచార్ సాథీ’తో తిరిగి పొందండి!

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ‘సంచార్ సాథీ’ వరంలా మారింది. ఈ <<15182220>>యాప్<<>> ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ వంటి రాష్ట్రాల్లో లక్షకు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టెలికం శాఖ తెలిపింది. Sanchar Saathi యాప్‌లో పోయిన ఫోన్‌ను సులభంగా బ్లాక్, ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ భద్రతను పెంచేందుకు, అపరిచిత సిమ్ కార్డులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
News April 11, 2026
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరం?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.
News April 11, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ ఎందుకు కనిపించట్లేదంటే?

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి తీవ్రగాయాలయ్యాయని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాళ్లు డ్యామేజీ అయ్యాయని, ముఖానికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో ఆయన బయటకు రావట్లేదని, ఆడియో ద్వారా ఆర్మీకి, ఇతర నాయకులకు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్‌ఫైర్ అంశంలో అమెరికాతోనూ మాట్లాడినట్లు సమాచారం.


