News May 7, 2024
ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్ హరి నారాయణన్

నెల్లూరులో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ 8వ తేదీలోగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలన్నారు.
Similar News
News October 22, 2025
కృష్ణపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. పోర్టుకు సమీపంలో తుఫాను ఉదృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పెన్నా నదికి వరద ఉదృతి పెరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News October 22, 2025
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు.
News October 22, 2025
నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.