News March 22, 2026
SKLM: ప్రతీ జర్నీ ప్రశాంతంగా సాగాలి: మంత్రులు

ప్రతీ జర్నీ ప్రశాంతంగా సాగాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణకూడలి నుంచి పెద్దపాడు జంక్షన్ వరకూ ప్లాంటేషన్, ఆధునీకరించిన నూతన రహదారి, సెంట్రల్ లైటింగ్‌ను శనివారం రాత్రి వారు ప్రారంభించారు. రూ.3.68కోట్ల సుడా నిధులతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగరానికి మరింత శోభ వచ్చిందన్నారు. కలెక్టర్, MLA శంకర్ ఉన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.