News March 22, 2026

ఆయిల్ పామ్ అంటే?

image

‘ఆయిల్ పామ్’ అనేది వంట నూనె అవసరాల కోసం సాగు చేసే వాణిజ్య పంట. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుంది. దీని పండ్ల గుజ్జు నుంచి పామాయిల్, గింజల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. మొక్క నాటిన 3-4 ఏళ్ల నుంచి దిగుబడి మొదలై 25-30 ఏళ్ల వరకు లాభాలిస్తుంది. దీని సాగుకు సమృద్ధిగా నీరు, 21°C-32°C మధ్య ఉష్ణోగ్రత అవసరం. అంతర పంటలకు అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వాల రాయితీ రైతుకు మేలు చేస్తుంది.

Similar News

News April 8, 2026

పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఇలా చేయండి!

image

పిల్లల ఎదుగుదలకు రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండటం అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి జావ, హలీమ్ గింజలు, కిస్మిస్, నువ్వులు హిమోగ్లోబిన్ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయని తెలిపారు. ‘రక్తకణాల ఉత్పత్తికి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుడ్లు, అటుకులు తీసుకోవాలి. ఐరన్ శరీరానికి సక్రమంగా అందాలంటే నారింజ, ఉసిరి, నిమ్మ వంటి విటమిన్-సి పండ్లను ఆహారంతో పాటు ఇవ్వాలి’ అని వైద్యులు సూచిస్తున్నారు.

News April 8, 2026

బీజేపీ కింద EC పని చేస్తోందని తేలిపోయింది: కేజ్రీవాల్

image

TMC <<19597056>>టార్గెట్‌<<>>గా ఎన్నికల సంఘం చేసిన ట్వీట్‌పై ఢిల్లీ Ex CM కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘BJP ఆధ్వర్యంలో EC పని చేస్తోందని, ఆ పార్టీ నుంచి ఆదేశాలు తీసుకుంటోందని చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బహిర్గతమైంది. ఇది అత్యంత దురదృష్టకరం. అలాంటి భాషలో ట్వీట్ చేసి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయకండి’ అని పేర్కొన్నారు. ECని తొలగించాలని UP Ex CM అఖిలేశ్ యాదవ్ ఫైరయ్యారు. ఎథికల్లీ కరప్ట్ ఇన్‌స్టిట్యూషన్ అని విమర్శించారు.

News April 8, 2026

అమెజాన్‌లో మరో 14 వేల మంది తొలగింపు!

image

అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తీసేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లోని మిడ్-లెవల్ మేనేజర్లపై ఈ ప్రభావం పడనుంది. AI కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.