News March 22, 2026

జిల్లాలో 265 ఎకరాల్లో పంట నష్టం

image

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో 7 గ్రామాల్లోని 190 మంది రైతులకు చెందిన సుమారు 265 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు వెల్లడించారు.

Similar News

News April 5, 2026

ఎలమంచిలి: రాష్ట్రస్థాయి మహిళల హాకీ పోటీలకు 18 మంది ఎంపిక

image

చిత్తూరులో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్రస్థాయి మహిళల హాకీ టోర్నమెంట్‌కు అనకాపల్లి జిల్లా నుంచి 18 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ నరేశ్ తెలిపారు. ఎంపిక పోటీలు ఆదివారం సాయంత్రం ఎలమంచిలి హాకీ గ్రౌండ్‌లో నిర్వహించామన్నారు.. ఈ పోటీల్లో 25 మంది పాల్గొన్నారని చెప్పారు.

News April 5, 2026

ఏలూరు: విందుకెళ్లి వస్తుండగా విషాదం.. లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం

image

జీలుగుమిల్లి (M) తాటి రామన్నగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలంగాణలోని చిచ్చోడి గుంపు గ్రామంలో జరిగిన ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం శివారులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు మృతదేహాలను అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2026

గోదావరి పుష్కరాల నిర్వహణపై డీజీపీ సమీక్ష

image

గోదావరి పుష్కరాలు -2027 నిర్వహణపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం రాజమండ్రిలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఏలూరు రేంజ్ డీఐజీ, వివిధ జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు,డిఎస్పీలు హాజరయ్యారు. పుష్కరాల నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక, రూట్ మ్యాప్ రూపొదించాలన్నారు.