News May 7, 2024
8న హనుమాన్ జంక్షన్లో పవన్ పర్యటన
బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ తెలిపారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా పవన్ రానున్నట్లు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని హెచ్ మార్ట్ వద్ద ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 27, 2024
కృష్ణా: MBA పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.
News December 27, 2024
రేపటి నుంచి సౌత్ జోన్ ఆక్వాటిక్ టోర్నీ
ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్ గురువారం తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది స్విమ్మర్లు పాల్గొంటారని అయన పేర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
News December 26, 2024
కృష్ణా: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కృష్ణా (D), నాగాయలంకకు చెందిన పృథ్వీరాజ్ RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లై పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.