News March 22, 2026

HYD: బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

image

ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై 21మీ. పైబడిన భవనాలను హైరైజ్‌గా పరిగణిస్తారు. భవన నిర్మాణ అనుమతులకు 50% TDR తప్పనిసరి కాగా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేలోపు మిగిలిన 50% చెల్లించాలి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతిస్తారు. సెట్ బ్యాక్ సడలింపులు అదనపు అంతస్తుల వినియోగంలో TDR లోడింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది.

Similar News

News April 1, 2026

అల్లూరి: 95 శాతం ఇంటి పన్నులు వసూలు

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 95 శాతం గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు బుధవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 430 పంచాయతీలు ఉండగా 412 పంచాయతీల్లో రూ.12 కోట్లు పన్నులు వసూలు చేశామన్నారు. మిగిలిన గ్రామాల్లో 2 రోజుల్లో వసూళ్లు పూర్తి చేసి జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2026

సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాలకు, అధికారులకు ర్యాంకింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. అన్ని సంక్షేమ పథకాలలో కనీసం 80శాతం నుంచి గరిష్ఠంగా 95 వరకు సంతృప్తి శాతం పెంచాలన్నారు.

News April 1, 2026

స్టేట్ వైడ్ టాప్ ర్యాంక్ మనదే..!

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు పరిష్కరించడంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించడంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది కృషి అభినందనీయమని కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. అధికారుల అంకితభావం, పారదర్శకత వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇదే ఉత్సాహంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.