News March 22, 2026
HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.
Similar News
News March 30, 2026
VKBలో భారీగా పడిపోయిన ధరలు.. బంద్ ప్రభావమా?

కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో గుడ్డు ధర రూ.3.50- రూ.4.50 మధ్య, ఇక ట్రే గుడ్లు రూ.120- రూ.140 పడిపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. చికెన్ షాపుల బంద్ పిలుపు సంక్షోభాన్ని మరింత హైలైట్ చేస్తోంది. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
News March 30, 2026
సూర్యాపేట: సన్నబియ్యం పంపిణీ పథకానికి ఏడాది పూర్తి

పేదల ఆహార భద్రత లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సన్నబియ్యం పంపిణీ’ పథకం నేటితో విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఏప్రిల్ 30న HNRలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల రేషన్ కార్డులుండగా, 9.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పట్ల లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
News March 30, 2026
‘మండే బ్లూస్’.. మీరూ ఇలానే ఫీల్ అవుతారా?

ఆదివారం సరదాగా గడిపాక సోమవారం ఆఫీసుకు వెళ్లాలంటే నీరసంగా ఫీల్ అవుతుంటారు. దీనినే ‘మండే బ్లూస్’ అని పిలుస్తారు. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే.. ప్రశాంతంగా మండేని ప్రారంభించాలి. ఆ రోజు చేయాల్సిన పనులను ఉదయమే ప్లాన్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. మీకు నచ్చిన పనితో రోజును స్టార్ట్ చేస్తే మీలో ఉత్సాహం పెరుగుతుంది. సోమవారం హ్యాపీగా ముగిస్తే, ఆ వారం అంతా జోష్‌గా ఉంటుంది.


