News March 23, 2026

‘వాట్సాప్’ల్లోనే అమ్మాయిల వివరాలు: నెల్లూరు ASP

image

నెల్లూరులో <<19448814>>వ్యభిచార<<>> ఘటనపై ASP దీక్ష మాట్లాడారు. ‘గతవారమే మాకు సమాచారం వచ్చింది. చిన్నబజార్‌లోని నాలుగు లాడ్జిల్లో సోదాలు చేశాం. లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD, బెంగళూరు నుంచి రప్పించి వారి ఫొటో, రేట్ నిర్ణయించి కస్టమర్‌కు వాట్సాప్ చేస్తారు. దీంతో ఇవాళ మా టీమ్‌తో దాడులు చేశాం. ఓ అమ్మాయితో నలుగురు విద్యార్థులు ఉండగా పట్టుకున్నాం. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేశాం. కేసు నమోదు చేస్తాం’ అని ASP తెలిపారు.

Similar News

News April 20, 2026

ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.

News April 20, 2026

BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

image

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్‌లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

News April 20, 2026

నెల్లూరు: 1,33,545 మెట్రిక్ టన్నులు సేకరణ

image

జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,33,545 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు జరిగిన పంట కోతల్లో ఖరీఫ్ సీజన్‌కు 74,353 మెట్రిక్ టన్నులు, రబీలో ఇప్పటి వరకు 59,291 ఎంటీలు చొప్పున ధాన్యం సేకరణ జరిగింది. ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. మరోవైపు దళారులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నా.. అరికట్టడం లేదు.