News March 23, 2026

కరెంట్ అఫైర్స్

image

* సుదీర్ఘకాలం (8,931 రోజులు) ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ
* టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం
* థాయ్‌లాండ్‌ ప్రధాని అనుతిన్‌ చర్న్‌విరకుల్‌ తిరిగి ఎన్నిక
* పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు ‘భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం
* కోకో సాగులో 1, జీడిపప్పు 2, కొబ్బరిలో 4వ స్థానంలో AP
* ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్‌. 116వ స్థానంలో భారత్‌

Similar News

News April 3, 2026

RED ALERT: రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

APలో ఎండలు ముదురుతున్నాయి. రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల 40-44 డిగ్రీలు రికార్డయ్యే ఛాన్సుందని రెడ్ అలర్ట్ ఇచ్చింది. కాగా ఇవాళ మన్యం(D) గుమ్మలక్ష్మీపురంలో 41.8, చిత్తూరు(D) పెద్దపంజనిలో 41.4, విజయనగరం(D)వంగరలో 41.1, చాలా ప్రాంతాల్లో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 3, 2026

36 గంటలు మీసేవ కేంద్రాలు బంద్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో ఈ రాత్రి 8PM నుంచి 36 గంటల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ ప్రక్రియకు సుమారు 36 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆదివారం ఉ.8 గంటల తర్వాత మీసేవ వెబ్‌సైట్ యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.

News April 3, 2026

రెహమాన్ సంచలనం.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

image

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ‘రామాయణ’ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే లాభాల్లోనూ వాటా ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకొన్న సంగీత దర్శకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు. AA23(అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్) మూవీ కోసం <<19330766>>అనిరుధ్<<>> రూ.25 కోట్లు తీసుకోనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.