News May 7, 2024
HYD: రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారు: కొండా
సీఎం రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. HYD శంషాబాద్‌లో సోమవారం భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News January 28, 2025
ఎకో టూరిజం స్పాట్‌గా వికారాబాద్: CM
వికారాబాద్‌ను ఎకో టూరిజం స్పాట్‌గా చేస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎక్స్‌పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మల్లెలతీర్థం, కొల్లాపూర్‌లో అద్భుతమైన ప్రకృతి ఉందని, వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
News January 28, 2025
HYD: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: గద్దర్ గళం
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ధ నౌక, దివంగత నేత గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గద్దర్ గళం అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య తెలిపారు. మంగళవారం HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
News January 28, 2025
HYD: KTRకు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ: మంత్రి సితక్క
కేటీఆర్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువని, ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమపడుతున్నాడని మంత్రి సీతక్క మండిపడ్డారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. ఈ సందర్భంగా నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కన్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేకపోతున్నాడని విమర్శించారు.