News March 23, 2026
BREAKING.. మెదక్: యువకుడి హత్య

చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మిర్జాపల్లికి చెందిన ప్రజలు ఈ దారిన వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిశ్రమల సమీపంలో హత్య జరగడంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరూ, హత్య చేసింది ఎవరూ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 14, 2026
స్టేట్ అథ్లెటిక్స్‌లో సిద్దిపేట క్రీడాకారుల సత్తా

హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 7 పతకాలు సాధించి సత్తా చాటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. ఈనెల 11, 12న జరిగిన పోటీల్లో గణేష్ 10,000 మీటర్ల పరుగులో బంగారు పతకం గెలుచుకున్నారు. అలాగే డెకాథ్లాన్‌లో ఉదయ్ కిరణ్ రజతం, ఆనంద్, రాహుల్, నగేష్‌లు కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు. విజేతలను అభినందించారు.
News April 14, 2026
కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి.
News April 14, 2026
జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.


