News May 7, 2024

REWIND: నంద్యాల జిల్లాలో సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌

image

నంద్యాల జిల్లా రాజకీయ ప్రస్థానంలో పెండేకంటి సుబ్బయ్యది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. ఆయన 1957 నుంచి 1977 వరకు వరసగా నాలుగుసార్లు నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1978 నుంచి 1984 వరకు ఎంపీగా గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌గా గుర్తింపు పొందారు.1985 నుంచి 88 వరకు బిహర్ గవర్నర్‌గా, 1988నుంచి 90వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు.

Similar News

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

News October 1, 2024

కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు

image

కర్నూలులోని వన్‌టౌన్‌ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్‌ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్‌, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.

News October 1, 2024

నేడు పత్తికొండకు CM చంద్రబాబు

image

కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.