News May 7, 2024

చరిత్రలో టాప్-5 అత్యంత వేడి సంవత్సరాల్లో 2024

image

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగిపోతున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ వెల్లడించింది. దీంతో చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాల్లో తొలి ఐదు స్థానాల్లో 2024 నిలుస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు పేర్కొంది. ఇక ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని వివరించింది.

Similar News

News January 4, 2025

మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?

image

TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.

News January 4, 2025

ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టులు

image

ఏపీలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీ సర్వే పూర్తైంది. మిగతాచోట్ల సర్వే చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుతో జరిగిన సమీక్షలో CM చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.

News January 4, 2025

బుమ్రాను రెచ్చగొట్టడం ప్రమాదం: మార్క్ వా

image

జస్ప్రీత్ బుమ్రాలాంటి బౌలర్‌ను రెచ్చగొట్టడం ఆస్ట్రేలియాకు ప్రమాదకరమని ఆ జట్టు మాజీ ఆటగాడు మార్క్ వా వ్యాఖ్యానించారు. ‘కొన్‌స్టాస్ ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి. ఆఖరి ఓవర్లో బుమ్రాను రెచ్చగొట్టాల్సిన అవసరం అతడికి ఏమాత్రం లేదు. అతడి వల్ల భారత ఆటగాళ్లందరూ ఏకమయ్యారు. కొన్‌స్టాస్ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ప్రత్యర్థి జట్లకు లక్ష్యంగా మారతాడు’ అని హితవు పలికారు.