News March 23, 2026

అమెరికాలో గుంటూరు గ్రామం.. అసలు నిజం ఇదే!

image

అమెరికాలోని డల్లాస్ సమీపంలో గుంటూరు పేరుతో గ్రామం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. అక్కడ అధికారికంగా అలాంటి గ్రామమేదీ లేదు. అయితే ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లా వాసులు అధికంగా నివసిస్తుండటంతో సరదాగా అలా పిలుచుకుంటున్నారు. కేవలం అనధికారిక నామకరణమే వైరల్ కావడంతో నెటిజన్లు క్లారిటీ ఇస్తున్నారు.

Similar News

News April 20, 2026

GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

image

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.

News April 20, 2026

పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

image

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.