News May 7, 2024

విజయనగరంలో నేడు నారాలోకేష్ యువగళం సభ

image

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు జిల్లాకు వస్తున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత, నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో లోకేష్ ముఖా ముఖీ మాట్లాడతారు. తొలుత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసంగిస్తారు

Similar News

News September 27, 2025

వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

image

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.

News September 27, 2025

VZM: రేపటి నుంచి అఖిల‌భార‌త డ్వాక్రా బ‌జార్‌

image

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ గొప్ప వేదిక‌గా నిలవ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ రామ సుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో శ‌నివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మ‌నంద‌రికీ అందుబాటులో విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభంకానున్న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

News September 27, 2025

VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

image

జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుప‌ల్లిలో 4, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 3, నెల్లిమ‌ర్ల‌లో 4, విజ‌య‌న‌గ‌రంలో 61, ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, త‌ర‌లింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.