News March 23, 2026

జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 46 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీలపై సమగ్ర విచారణ చేసి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్ ఉన్నారు.

Similar News

News April 14, 2026

స్టేట్ అథ్లెటిక్స్‌లో సిద్దిపేట క్రీడాకారుల సత్తా

image

హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 7 పతకాలు సాధించి సత్తా చాటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. ఈనెల 11, 12న జరిగిన పోటీల్లో గణేష్ 10,000 మీటర్ల పరుగులో బంగారు పతకం గెలుచుకున్నారు. అలాగే డెకాథ్లాన్‌లో ఉదయ్ కిరణ్ రజతం, ఆనంద్, రాహుల్, నగేష్‌లు కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు. విజేతలను అభినందించారు.

News April 14, 2026

కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

image

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్‌ తొలగిపోతాయి.

News April 14, 2026

జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

image

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.