News March 23, 2026
కానాయపల్లిలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గత 24 గంటల్లో జిల్లాలోని 21 కేంద్రాల్లో నమోదైన వివరాల ప్రకారం.. అత్యధికంగా కానాయపల్లిలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెలుగొండ, మదనపూర్ ప్రాంతాల్లో 38.7 డిగ్రీలుగా ఉండగా, వనపర్తి, పెబ్బేరులో 37.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 17, 2026
అనంతపురం జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి

గుంతకల్ డివిజనల్ లెవల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO)గా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె 15 రోజుల్లోగా నూతన బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
News April 17, 2026
మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం: షా

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పష్టం చేశారు. తమకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు జన్మత: లభిస్తాయని, మతమార్పిడులతో రావని అన్నారు. రాజ్యాంగం కూడా మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించదని తెలిపారు. ఓబీసీలకు రాజ్యాధికారం కల్పించిన పార్టీ కూడా తమదేనని పేర్కొన్నారు. కులగణనను తొలి నుంచీ వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు.
News April 17, 2026
కాకినాడ జిల్లాలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షల అప్డేట్

ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ 163, 189 సెక్షన్లు అమలు చేస్తూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


