News March 23, 2026

IPL: ఆ రికార్డు SRHదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన 287/3 స్కోరు అత్యధికం. హెడ్, క్లాసెన్ వంటి పవర్‌ హిట్టర్ల విధ్వంసంతో 2025లోనూ SRH 286/6(RR) & 278/3(MI)తో తన సత్తా ఏంటో చూపించింది. అత్యధిక స్కోర్ల జాబితాలో టాప్-5లో నాలుగు SRH పేరిట ఉండటం విశేషం. అలాగే 2024లో DCపై KKR 272/7తో ఐదో పొజిషన్‌లో ఉంది. ఈ సీజన్‌లోనైనా SRH 300 రన్స్ కొడుతుందో చూడాలి.

Similar News

News April 2, 2026

హై కొలెస్ట్రాల్‌కు లక్షణాలు ఉంటాయా?

image

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.

News April 2, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లకు నేడే లాస్ట్

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఒకటో తరగతితో పాటు బాల వాటికల్లో ప్రవేశాలకు https://kvsangathan.nic.in/లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.

News April 2, 2026

వివాహేతర డేటింగ్ యాప్స్‌.. పెరుగుతున్న మహిళా యూజర్లు!

image

దేశంలో వివాహ బంధాల తీరు మారుతోంది. ఒక ప్రముఖ వివాహేతర డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో మహిళా యూజర్ల సంఖ్య రెండేళ్లలో 148% పెరిగింది. మోడ్రన్ లైఫ్‌స్టైల్, ఎమోషనల్‌గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత బయటి సంబంధాల కోసం వెతుకుతున్నారని తేలింది. టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో వివాహ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.