News March 23, 2026
ఏప్రిల్ 3న ఓటీటీలోకి ‘సితారే జమీన్ పర్’

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఎట్టకేలకు OTTలోకి రానుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది జూన్ 20న ఈ మూవీ రిలీజ్ కాగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు. రూ.100 చెల్లించి చూసే అవకాశం కల్పించారు. ఇప్పుడు OTTలోకి వస్తోంది.
Similar News
News April 7, 2026
అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్‌గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.
News April 7, 2026
అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(2/2)..

2వ దశ అయిన ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల’ టెక్నాలజీలో భారత్ తాజాగా విజయం సాధించింది. ఇక్కడ రియాక్టర్‌లో థోరియంను ఉంచుతారు. దాన్ని ప్లుటోనియం సాయంతో యురేనియం-233గా మారుస్తారు. ఇక 3వ దశలో ఈ యురేనియం-233, థోరియంలను ఇంధనంగా వాడి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. మన దగ్గర థోరియం నిల్వలు పుష్కలం. మూడో దశ థోరియం ఆధారిత రియాక్టర్లు పూర్తయితే వచ్చే 300-400 ఏళ్ల పాటు ఇండియాకు విద్యుత్ కొరతే ఉండదు.
News April 7, 2026
ఏఐ కంటే డేంజర్.. చైనాలో వింత ధోరణి!

చైనాలోని కార్పొరేట్ కంపెనీల్లో AI వింత పరిస్థితులకు కారణమవుతోంది. ఉద్యోగులు ‘colleague.skill’ వంటి టూల్స్ వాడి తోటివారి నైపుణ్యాలను ఏఐకి నేర్పిస్తూ, ఆ పనులను ఆటోమేట్ చేస్తున్నారు. ఇలా చేస్తే తమకు ప్రాధాన్యం పెరిగి, లేఆఫ్స్‌లో సేఫ్‌గా ఉండొచ్చని వారి ప్లాన్. దీంతో కొలీగ్సే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడతారోనని ఉద్యోగులు తమ పని రహస్యాలను దాస్తున్నారు. ఏఐ కంటే తోటి ఉద్యోగులే డేంజర్ అనే చర్చ మొదలైంది.


