News March 23, 2026
CGD నెట్వర్క్‌తో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

AP: LPG కొరత నేపథ్యంలో ఇళ్లకు, వ్యాపారాలకు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) పంపిణీకి GOVT చర్యలు చేపట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు GO జారీచేసింది. PNG సరఫరాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు విధివిధానాలను నిర్దేశించింది. పైప్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అనుమతులు వంటివి వేగంగా పూర్తయ్యేలా గడువు విధించింది. ఇందుకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది.
Similar News
News April 15, 2026
రూ.5108 కోట్లతో పోలవరం R&R పనులు: CBN

AP: పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, నల్లమల సాగర్ లింక్, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రూ.5108 కోట్లతో పోలవరం సివిల్, R&R పనులు చేపట్టాలని ఆదేశించారు. 38060 నిర్వాసిత కుటుంబాల్లో 16763 ఫ్యామిలీలను తరలించారని, మిగతా వారిని 2027 APRకల్లా తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు రూ.27,089 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.

గంభీర్ శత్రువులను కొని తెచ్చుకుంటున్నారు: మునాఫ్

గంభీర్‌ను కోచ్‌గా తొలగిస్తే ప్లేయర్స్‌ను మేనేజ్ చేయడం కష్టమవుతుందని మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఆయన ముక్కుసూటితనం చాలా మందికి నచ్చదన్నారు. కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలను పక్కనపెట్టడం సామాన్యమైన విషయం కాదని, దేశం కోసం గంభీర్ ఎంతోమంది శత్రువులను కొని తెచ్చుకుంటుున్నారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకోవడంతో వాళ్ల ఫ్యాన్స్ గంభీర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే.