News May 7, 2024
ఇద్దరు అధికారులపై పల్నాడు కలెక్టర్ చర్యలు

నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా ఈవీఎం పేపర్లను అధికారులు జారీ చేశారు. దీంతో ఇరువురిపై చర్యలు తీసుకున్నారు. 5న ఓటింగ్‌లో పాల్గొన్న 1,219మంది ఉద్యోగులు 8, 9 తేదీల్లో ఓటు వేయాలని సూచించారు.
Similar News
News July 9, 2025
GNT: తురకపాలెం రోడ్డులో వ్యక్తి దారుణ హత్య

నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డులో కరిముల్లా హత్యకు గురయ్యాడు. స్తంభాలగరువుకు చెందిన నివాసిగా పోలీసులు నిర్థారించారు. కరిముల్లా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు మధురెడ్డి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 9, 2025
విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించండి: CPI

విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరణపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు. హోంగార్డుల జీతాల పెంపు, బదిలీలు, కోటా అమలుపై కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని రామకృష్ణ తెలిపారు.
News July 8, 2025
గుంటూరు జిల్లాలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్

మత్తుపదార్థాల రహిత విద్యా వాతావరణం కోసం గుంటూరు జిల్లాలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” స్పెషల్ డ్రైవ్ మంగళవారం ప్రారంభమైంది. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్లు, గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.