News May 7, 2024

బాబ్బాబూ.. భారతీయులు రండి: మాల్దీవులు

image

భారత్‌తో మాల్దీవుల వివాదం అనంతరం అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఇప్పుడు ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైజల్ భారతీయుల్ని రమ్మని వేడుకుంటున్నారు. ‘మా కొత్త ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేస్తుంది. స్నేహపూర్వక వాతావరణాన్నే మేమూ కోరుకుంటున్నాం. భారతీయులకు మా ప్రజలు, ప్రభుత్వం కలిసి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి భారతీయులు మా టూరిజంలో భాగస్వాములు కండి’ అని విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 7, 2025

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.

News January 7, 2025

ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం

image

ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.

News January 7, 2025

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు

image

తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.