News May 7, 2024
దేశంలో సావరిన్ వెల్త్ ఫండ్స్ జోరు
భారత్‌లో సావరిన్ వెల్త్ ఫండ్స్ (SWF) రూపంలో విదేశాల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏడాది వ్యవధిలో భారత్‌లో SWF అసెట్స్ 60% పెరిగి రూ.4.7లక్షల కోట్లకు (ఏప్రిల్ నాటికి) చేరాయి. 2023లో ఈ మొత్తం రూ.3లక్షల కోట్లుగా ఉంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (FPI) పరిధిలోని మొత్తం ఆస్తుల విలువ 40% పెరిగి రూ.69.5లక్షల కోట్లకు చేరాయి. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 7, 2025
ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం
ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.
News January 7, 2025
తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు
తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
News January 7, 2025
YS జగన్ సమీప బంధువు మృతి
AP: YS జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో మూడు నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన HYD AIGలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. YS ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన ఆయన జగన్‌కు సోదరుడి వరుస అవుతారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. బెంగళూరులో స్కూలు విద్యాభ్యాసం, ఖమ్మం మమతా కాలేజీలో MBBS చదివారు.