News March 24, 2026
కరెంట్ అఫైర్స్

* ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్‌ను చేర్చాలని UNESCOకు ప్రతిపాదన.
* భారత్-సీషెల్స్ మధ్య ‘ఎక్సర్‌సైజ్ లామిటియే’ 11వ ఎడిషన్ పూర్తి. లామిటియే అంటే స్నేహం.
* వరల్డ్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్-సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు 28వ స్థానం.
* జలంధర్‌లోని ఆదంపుర్ విమానాశ్రయానికి ‘శ్రీగురు రవిదాస్ మహారాజ్ ఎయిర్‌పోర్టు’గా పేరు మార్పు. SHARE IT
Similar News
News April 5, 2026
PHOTO GALLERY: ఉప్పల్‌లో SRH మ్యాచ్

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH, LSG మ్యాచుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 39వేల మంది వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సైతం స్టేడియానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేశారు. చేతిలో ఆరెంజ్ జెండా పట్టుకొని ఉత్తేజపరిచారు. SRH ఓనర్ కావ్య, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా, బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, నిర్మాత సురేశ్ బాబు సందడి చేశారు.
News April 5, 2026
ట్రంప్‌కు పిచ్చి పట్టిందా?

‘హార్ముజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడం మాకో లెక్క కాదు. రెండు నిమిషాల పని’ అని 6 రోజుల క్రితం ట్రంప్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బా*ర్డ్స్ అంటూ చిల్లర భాష మాట్లాడారు. దీంతో ట్రంప్ మెదడు పని చేస్తోందా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
News April 5, 2026
ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.


