News March 24, 2026

వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

image

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.

Similar News

News April 8, 2026

పీ&కే ఎరువులపై ₹41,534కోట్ల రాయితీకి కేంద్రం ఆమోదం

image

ఖరీఫ్ సీజన్‌లో పీ అండ్ కే ఎరువులపై ₹41,534 కోట్ల రాయితీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఖరీఫ్ సీజన్‌కు ఈ సబ్సిడీ అమలులో ఉంటుందని పేర్కొంది. డై-అమ్మోనియమ్ ఫాస్పేట్ (DAP) ధరలు అంతర్జాతీయంగా పెరిగినా రైతులపై భారం పడకుండా ఉండేందుకు ధరలలో మార్పులు చేయలేదని వెల్లడించింది. దీంతో 50కిలోల బ్యాగ్ ధర ₹1,350గా కొనసాగనుంది.

News April 8, 2026

శబరిమలకు మహిళల ప్రవేశంపై SC Vs కేంద్రం

image

శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య మహిళల ప్రవేశంపై ఆంక్షల కేసులో SC కీలక వ్యాఖ్యలు చేసింది. మతాల్లోని మూఢవిశ్వాసాలను ఎత్తిచూపే హక్కు తమకు ఉందంది. జడ్జీలు న్యాయరంగంలో మాత్రమే నిపుణులని.. మతం, సంప్రదాయాలపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించడం సరికాదన్న కేంద్రం వాదనలపై ఇలా రియాక్ట్ అయింది. కాగా 2018లో మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ తీర్పు వచ్చినా రివ్యూ పిటిషన్ల వల్ల 10-50 ఏళ్ల వారికి అనుమతి నిలిచిపోయింది.

News April 8, 2026

పవన్‌లో కర్మయోగిని చూశా: డైరెక్టర్ బాబీ

image

AP Dy.CM పవన్‌ను డైరెక్టర్ బాబీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన(సర్దార్ గబ్బర్ సింగ్) జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్తులు పెంచుకోవడమే రాజకీయం అనుకునే ఈ రోజుల్లో ప్రజా సేవ కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకొని శ్రమిస్తున్న ఋషి పవన్ కళ్యాణ్. జ్ఞానం కోసం అడవికి వెళ్లిన బుద్ధుడిని చరిత్రలో చదివాం. జనం కోసం నిరంతరం తపించే కర్మయోగిని ఇవాళ కళ్లారా చూశా’ అని కొనియాడారు.