News May 7, 2024
తిరుపతిలో మొదలైన నగదు పంపిణీ..!

పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ప్రచారంతో పాటు పోల్‌మేనేజ్‌మెంట్ తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రహస్య స్థావరాలకు ఓటర్లను పిలిచి డబ్బు ఇస్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News January 19, 2026
గంగవరం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం?

గంగవరం(M) డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. నిత్యం కాలేజీ విద్యార్థులు, బయట ప్రాంతాల నుంచి విటులు రావడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
News January 19, 2026
కుప్పం: చెరువులో పడి మహిళ ఆత్మహత్య

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని NTR కాలనీకి చెందిన చలపతి భార్య ప్రభావతమ్మ (54) చీలేపల్లి చెరువులో పడి మృతి చెందింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆమె ఆదివారం చెరువులో పడినట్లు స్థానికులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.


